Thursday 25 June 2015

ఒక్క క్షణం లో నీ దృష్టిని 
ఇట్టే ఆకర్షించవచ్చు ...
ఒక్క నిముషం పాటు నీ చూపు ని 
తిప్పుకోనివ్వకుండా బంధించెయ్యవచ్చు...
ఒక్క గంట సేపు నీ గుండె ని 
దడ దడా కొట్టుకునేటట్టు చెయ్యవచ్చు ...
ఒక్క రోజంతా నీ మదిలో 
గిలిగింతలు కలిగించ వచ్చు , ఇంకా  
గణ గణా గంటలు మోగించవచ్చు
ఒక్క నెల రోజులు నీ మనసులో 
గుబులు పుట్టించ వచ్చు
తుఫాన్ సృష్టించ వచ్చు ......


శాశ్వతంగా నా దానివి కావాలన్నా
నా సొంతమవ్వాలన్నా ఇవేవీసరిపోవు 
అందుకు మాయలూ మంత్రాలూ అంటూవేరే ఏవీలేవు 
ఆకర్షణతో ఎవర్నీ కూడా
ఎక్కువకాలం పట్టి బంధించ లేము 
అంతకు మించినది మరేదో కావాలి 
అనురాగమో అనుబంధమో 
అదేదో నాకూ సరిగ్గా తెలీదు 
అదో పెద్ద చిదంబర రహస్యం 
ఒక్కసారి ప్రేమించుకుని 
కొంగుముడి వేసుకుని చేయి చేయి పట్టుకుని
ఏడడుగులు నడిచి వెళదామా ?
ఆ రహస్యమేదో కనిపెడదామా ?

2 comments:

  1. ఇంతకీ దీని టైల్ ఏంటి సార్? :-)

    ReplyDelete