Sunday 18 October 2015







అన్నిటినీ విడిచి .....
అంతా ఒదిలి 
కాకిలా ఏకాకినై
ఆకాశ మార్గం లో 
అలా .......అలా........
చెలా........చెలా........



గాల్లో ఎగిరిపోతూ 
దూది పింజనై తేలిపోతూ 
నిర్లిప్తం గా నిర్వ్యామోహం గా
స్వర్గారోహణ మార్గం లో....
అలా .......అలా........
చెలా........చెలా........



బంధాలు బాధ్యతలు
ఆశలూ ఆశయాలూ 
అశ్రువులూ ఆనందాలూ
ఏవీ ఉండని శూన్య మార్గంలో......
అలా .......అలా........
చెలా........చెలా........



కట్టె కాటి లో కడతేర
అస్తికలు గంగలో కలవ0గా
పాప పుణ్యాలు మూట కట్టుకుని 
అసువులు నడిచే అంతిమ మార్గంలో.... 
అలా .......అలా........
చెలా........చెలా...






No comments:

Post a Comment