Sunday 1 November 2015

రగులుతున్న గుండెలతో 
రంకేలేసే పదాలతో
విషాద గీతికలు రాసి 
నన్నెక్కువగా ఏడిపించకు .
నిన్నటి దాకా ఏడిచి ఏడిచి 
ఇప్పుడిప్పుడే 
కళ్ళు తుడుచు కుంటున్నాను .
ఇద్దరిలో ఎవరి తప్పూ లేదు  ,
అమ్మో నాన్నో డబ్బో తొక్కో ...
మరేదో కారణం అంతే ! !
చూపు ఒక్కటే కళ్ళు రెండుగా 
ఆత్మ ఒక్కటే తనువులు రెండుగా
విడిపోయామని తెలుసుకో ....
ఒకరు సుఖంగా ఉన్నంత కాలమే 
వేరొకరు ప్రాణాలతో ఉంటారు గుర్తుంచుకో  





2 comments:

  1. సత్సంబంధానికి అర్దం చేసుకునే మనసుంటే చాలునని మీ రీతిలో చాలా బాగా చెప్పారు వెంకట్ గారు.

    The Real Strength of a Relationship lies in Understanding One another.. and Respecting the Differences.

    ReplyDelete