Thursday 17 March 2016



కొంచెం బిజీగా ఉన్నానంది
తరవాత ఫోన్ చెయ్యమని
మర్యాదగా చెప్పింది
కొంచెం బిజీగా ఉందంట ....
కొంచెం బిజీగా....
ఎంత కొంచెమో మరి ....... ?  ?  ?

పచ్చటి నుదురు మీద
రెండు కనుబొమల మధ్యా
పెట్టుకున్న నల్లటి
స్టిక్కరంత కొంచెమా ?

ఎర్రటి పెదాలకీ
పనస తొనలాంటి
చుబుకానికీ మధ్య దాగున్న
పుట్టుమచ్చంత కొంచెమా ?

నన్ను కవ్వించి కవ్వించి
ఉడికించి చంపాలని
కనీ కనబడకుండా స్వల్పంగా ఒదిలేసే
అల్లరి  పైటంత  కొంచెమా  ?

గింజుకుని  పెనుగులాడి
పారిపోవడంకోసం తప్పనిసరై
ముష్టిగా పడేసే ఒక
పిసినారి ముద్దంత కొంచెమా  ?

కొంచెం బిజీగా ఉందంట ....
కొంచెం బిజీగా....
ఎంత కొంచెమో మరి ....... ?  ?  ?

దొరకదా  ?
సాయంత్రం దొరకదా  ?
పోనీ రేపైనా దొరకదా  ?
ఆ కొంచేనికి బదులుగా
బ్రహ్మాండమంత  మిఠాయి
పొట్లం మొత్తం నొక్కెయ్యనా   ?

No comments:

Post a Comment